వంకాయ. ఈ వంకాయలను అనేక రకాలుగా రుచిగా చేసుకుని తింటూ వుంటారు. కానీ కొంతమంది ఈ వంకాయలను అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేమిటో తెలుసుకుందాము. జీర్ణ సమస్య వున్నవారు వంకాయ తినకూడదు, తింటే కడుపు ఉబ్బరం తదితర సమస్యలొస్తాయి.
ఎలెర్జీలు వున్నవారు వంకాయలను తినకపోవడం మంచిది. మానసిక ఒత్తిడితో వున్నవారు కూడా వంకాయలను దూరం పెట్టేయాలి. రక్తహీనతతో బాధపడేవారు వంకాయలను తినరాదు, తిన్నట్లయితే బ్లడ్ కౌంట్ పెరగడం మందగిస్తుంది.\
కళ్లలో దురద తదితర సమస్యలున్నవారు వంకాయలను తినకూడదు. పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే వంకాయను తినరాదు, ఎందుకంటే ఇది సమస్యను పెంచుతుంది. కిడ్నీలో రాళ్లు సమస్య వున్నవారు వంకాయల జోలికి వెళ్లకూడదు.