వేసవిలో జామకాయను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామలో బి3, బి6 విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి, మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఇక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు జామ ఆకులను ముద్దగా నూరి.. నొప్పి ఉన్నచోట ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
పచ్చి జామకాయ పేస్టును ముద్దలా నూరి నుదిటిపై వుంచితే.. మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గింజలు తీసిన జామకాయ ముక్కలకు పంచదార కలిపి, వాటిని మెత్తగా ఉడికించి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో వీరి గుండె పనితీరు మెరుగుపడుతోంది. జామను ఎక్కువగా తినేవారి చర్మం ఎలాంటి మచ్చలు, ముడుతలు లేకుండా మెరుస్తూ.. ఉంటుంది. వృద్ధాప్యఛాయలు కనుమరుగవుతాయి. జామకాయలను వేసవిలో తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి దూరమవుతుంది. మధుమేహం దూరమవుతుంది.
హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు జామపండును, జామకాయను తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇందులో విటమిన్ ఎ, పొటాషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా వుంటుంది. జామ ముక్కలను స్నాక్స్‌గా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.