రోజూ ఓ ఆపిల్‌ను తీసుకోండి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే కానీ, గుండెకు హాని కలగకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఈ ఆపిల్‌లో ''పెక్టిన్'' అనే పదార్థం పుష్కలంగా కలిగి వుంది. ఇది శరీరంలోని కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఇకపోతే, ఆపిల్ తినడం ద్వారా అల్జీమర్స్, మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. క్వెర్సెటీవ్ అనే ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాపిల్‌లో పుష్కలంగా ఉండటం ద్వారా నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా బ్రెయిన్ సెల్స్ దెబ్బతినకుండా తోడ్పడుతుంది. ముఖ్యంగా మధుమేహం వస్తుందనే భయంతో పండ్లను తినడం మానేస్తుంటారు.