తేన్పులు వస్తున్నాయా? ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకండి..

శనివారం, 19 అక్టోబరు 2019 (13:43 IST)
ఆహారం తీసుకున్న తర్వాత తేన్పులు వస్తున్నాయా? ఇందుకు ఏం చేయాలంటే.. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపులో అతిగా పేరుకుపోయిన వాయువులు బయటికి తేన్పుల రూపంలో వస్తాయి. ఈ వాయువులు జీర్ణాశయంలో చేరడానికి కారణాలున్నాయి.
 
ముఖ్యంగా ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలా చేస్తే ఆహారం తీసుకుంటున్నప్పుడు అధికంగా గాలిని మింగడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ, హియాటస్‌ హెర్మా వంటివాటితో కడుపులో వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ సమస్య ఎక్కువైతే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు నిదానంగా నమిలి తింటే పొట్టలో గాలి చేరకుండా చూసుకోవచ్చు. పాలు, చిక్కుడు జాతి కూరలు, క్యాబేజీ, ఉల్లిపాయతోపాటు వేపుళ్లను తగ్గించుకోవాలి. అప్పుడే వాయువులు తగ్గుతాయి. అల్లం, శొంఠి, ఇంగువ, వాము, పుదీనా, సోంపు, జీలకర్రను ఎక్కువగా వాడుతుంటే తేన్పులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఒకసారి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేవరకు మళ్లీ తీసుకోకూడదు. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలి. 
 
తేన్పులకు చిట్కాలు
* రెండు లేదా మూడు లేత తమలపాకుల్లో కొద్దిగా వక్క, సున్నం, ఒక లవంగం వేసుకోవాలి. 
* అన్నం తిన్న తరువాత ఈ తాంబూలం నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నములుతూంటే సమస్య చాలామటుకు తగ్గుతుంది.
* పుదీనా పచ్చడిని తరచూ ఆహారంలో తింటూంటే తేన్పులు తగ్గుతాయి.
 
* భోజనం చేసిన వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలినా ఉపశమనం ఉంటుంది.
* వాము వేయించి పొడి చేసుకోవాలి. కొద్దిగా వేడి అన్నంలో చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకుని తినాలి.
* భోజనం చేసిన వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలినా ఉపశమనం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు