1. దేశ - కాలాదులకు అనుగుణంగా సంతృప్తికరమైన ఆహారమును రోజుకు రెండువేళలందు మాత్రమే భుజించాలి. అవి.. పగలు, రాత్రి. త్రేనుపు సులువుగా కలుగుట, మలమూత్రములు సాఫీగా పోవుట, ఆకలిదప్పులు కలుగుట అనే లక్షణాలు ఆహారం బాగా జీర్ణమైన వానిలో కలుగుతాయి.
3. భోజనం చేసే ప్రతిసారీ.. కొంచెం అన్నంలో అల్లం, సైంధవ లవణం కలిపి తినుట చాలా ఆరోగ్యకరం. అన్నం మీద అయిష్టతను, అరుచిని పోగొట్టి.. ఆకలిని వృద్ధిచేస్తుంది. నాలుకను, కంఠమును శుద్దిచేస్తుంది.
5. తామరకాడలు, తామర తూడులు, తామరగడ్డలు, చెఱకు మొదలగు వాటిని భోజనమునకు ముందే భుజించాలి. భోజనానంతరం తినకూడదు. భోజన సమయంలో గట్టి పదార్థాలను ముందు తరువాత మృదుపదార్థాలను, చివరిలో ద్రవపదార్థాలను తీసుకొనుట మంచిది. బలం కలుగుతుంది.
6. కఫ, వాత వ్యాధులుండే వారు మాత్రం వెండిపాత్రలో భోజనం చేయరాదు. ఇత్తడి పాత్రలో భోజనం చేయుట వలన క్రిములు నశించును. కఫ వ్యాధులను నివారించును. శోష, పాండు రోగములను అరికట్టును. శరీరానికి బలాన్ని చేకూర్చును.