కళ్లు అలసిపోతే.. మల్లెపూల రసం వుందిగా..?

సోమవారం, 17 డిశెంబరు 2018 (16:15 IST)
కళ్లు బాగా అలసిపోతే.. మల్లెపూల రసాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది. కళ్లు బాగా అలసినప్పుడు.. మల్లెపూల రసంతో కంటిచుట్టు భాగాల్లో మర్దన చేసుకుని నిద్రిస్తే మంచి ఫలితం వుంటుంది. మల్లెల సువాసన నిద్రలేమిని కూడా దూరం చేస్తుందట. మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి.. ముఖానికి రాసుకంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
మొటిమల వల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనె రాస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాల్లో కూడా నేడు మల్లెపూలను వాడుతున్నారు. చర్మానికి అవసరమయ్యే సి విటమిన్‌ మల్లెపూల పుష్కలంగా ఉంటుంది. కొబ్బరినూనెతో కలిపి మల్లెపూల రసాన్ని తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు