ఆఫీసులో ఒక రోజులో 6 గంటలకు పైగా కూర్చుంటే..?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (15:56 IST)
ఆఫీసులో ఒక రోజులో 6 గంటలకు పైగా డెస్క్ వద్ద కూర్చుని ఉంటే గుండె జబ్బుల ప్రమాదం 64 శాతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే సిస్టమ్స్ ముందు కూర్చుని పెన్సిల్స్ కొరకడం లేదా పెన్స్ కొరకడం ద్వారా దంతాలకు హాని కలగవచ్చు. 
 
ఎప్పుడుపడితే అప్పుడు కంప్యూటర్ ఉపయోగించడం వలన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. స్ర్కీన్ కాంతి ద్వారా కంటి అలసట, తలనొప్పిని కలిగిస్తుంది. కొన్ని కంప్యూటర్లు నరాలకు నష్టం కలిగించే టాక్సిన్స్ కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ల ముందు గంటల తరబడి అతుక్కుపోయే వారిలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఒబిసిటీకి దారితీస్తుందని, గుండె సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు