దగ్గుకు సహజమైన మందు లవంగం, శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది.
లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.
వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.
తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.