పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే?

శనివారం, 13 మే 2017 (16:05 IST)
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇకా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో తేనె కలుపుకుని తీసుకోవడం ద్వారా అల్సర్‌కు చెక్ పెట్టొచ్చు. ఇది యాంటీ బయోటిక్ పనిచేస్తుందని.. తద్వారా శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బరువు తగ్గాలంటే కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినడం ద్వారా శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. తద్వారా మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. ఇలా చేస్తే నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ  సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి