ఇప్పుడు, బాగా తగ్గిన కలెక్లన్లు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుకున్నంత ఎగ్జయిట్ మెంట్ ప్రేక్షకుల్లో కనిపించలేదు. తెలుగు పంపిణీదారు నాగ వంశీ ఇకపై సోషల్ మీడియాలో పోస్టింగ్ లనుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రతి సినిమాకు ఆయన బాగా రియాక్ట్ అయ్యేవారు. కలెక్లన్లు, రివ్యూ రేటింగ్, సినిమా నిర్మాణ విలువలతో కూడిన విషయాలను నిక్కచ్చిగా పోస్ట్ లు పెడుతుండేవాడు. కానీ వార్ 2 నుంచి సెలైంట్ గా వున్నారు.
తాజాగా ఊహాగానాలకు క్లారిటీ ఇస్తూ, నాగ వంశీ X (గతంలో ట్విట్టర్)లో పుకార్లను ప్రస్తావించారు. ఆయన తెలుగులో ఇలా రాసారు, "ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నారు.. వంశీ ఆది, వంశీ ఇది అని గ్రిప్పింగ్ కథనాలు తో ఫుల్ హడావిడి నడుస్తుంది... పర్లేదు, ఎక్స్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమించండి, కానీ ఇంకా ఆ టైం 10 సంవత్సరాలు రాలేదు... 10 సంవత్సరాలలో కనీసం 10 సినిమాల్లో... మా తదుపరి విహారయాత్ర మాస్ జాతరతో మీ అందరినీ కలుద్దాం అంటూ పోస్ట్ చేశారు.