జొన్న సంకటి.. జొన్న రొట్టెలు తింటే?

బుధవారం, 15 నవంబరు 2017 (14:02 IST)
జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జొన్నల్లో ప్రొటీన్లే కాకుండా పాస్పరస్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నేరేడు పండ్లలో వుండే యాంటీయాక్సిడెంట్ల కంటే జొన్నల్లో రెట్టింపు యాంటీ-యాక్సిడెంట్లు వుంటాయి. జొన్న సంకటి, జొన్న అంబలి, జొన్న రొట్టెలను ఆహారంలో తీసుకుంటే.. గుండెజబ్బులు, కేన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు.
 
మెరుగైన జీర్ణక్రియకి తోడ్పడే ఫైబర్‌ జొన్నల్లో ఎక్కువగా లభిస్తుంది. వీటిల్లో నియాసిన్‌ అనే బి-6 విటమిన్‌ కాంపౌండ్‌ ఉంటుంది. అది తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అయి శక్తిలా మారడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. ఒబిసిటీ దూరమవుతుంది.
 
జొన్నలు శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లాన్ని శరీరానికి అందిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇతర ధాన్యాల కన్నా జొన్నల్లో ఇనుము, జి౦కు ఎక్కువగా ఉ౦టాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు