జీవితంలో ఉదయం నిద్రలేచిన తొలి క్షణాల్లో బద్దకాన్ని కాస్త విడనాడి హుషారుగా ఉంటే ఆ రోజంతా దినవారీ కార్యక్రమాలను చలాకీగా నిర్వహించుకోవచ్చు. నిద్రలేచినప్పటి నుండి ఇంటి పనులు, ఆఫీసుకు పరుగెత్తడం వంటి వాటితో సతమతమయ్యే మహిళలు కొందరైతే.. నింపాదిగా పనులు చేసుకుపోయే వారు మరికొందరు. కాగా సమయానికి ఏ పనీ కాదేమోనని ఆలోచనలలో పడిపోయి రక్తపోటు పెంచుకునేవారు ఇంకొందరు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..
2. దినచర్యలో మొదట మనసుకు నచ్చిన పనులు జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో 5 నిమిషాలు కబుర్లు చెప్పడం, వార్తా పత్రిక చూడడం, ఇష్టమైన పాటలు వినటం వంటివి చేయటం వలన ఆ రోజును ఏ పని చేయాలనుకున్నా ఉత్సాహంగా చేస్తారు.
5. శరీరం మొత్తాన్ని అంటే కాళ్ళు చేతులు, వీపు, ఉదరం అన్ని అంగాలూ కదిలేలా శరీరాన్ని బలంగా విరుచుకోవాలి. తరువాత లేచినిలబడి చేతులను పైకి ఎత్తి వ్యతిరేక దిశలో ఓ పదిసార్లు గుండ్రంగా తిప్పితే శరీరం ఉత్సాహభరితం అవుతుంది.