కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్ వీటిల్లో కంటి కనపించకుండా బోలెడంత చక్కెర దాక్కొని ఉంటుంది.
అందువలన ఇది మితిమీరితే కుంగుబాటు వంటి మానసిక సమస్యల వచ్చే ప్రమాదాలున్నాయి.
రోజుకు 67 గ్రాములు అంతకన్నా ఎక్కువ చక్కెర తీసుకునేవారికి కుంగుబాటు ముప్పు 23 శాతం ఎక్కువ.
తీపి పానీయాలు తీసుకున్నప్పుడు మూడ్, ఉత్సాహం పెరిగినట్టు అనిపిస్తుంది.
వీటిల్లో ప్రోటీన్స్, పీచు వంటివేవీ లేకపోవడం వలన త్వరలోనే శక్తి సన్నగిల్లుతుంది.