ఈ చిట్కాలు పాటిస్తే గుండె పదిలం.. (video)

గురువారం, 28 మే 2020 (23:03 IST)
ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఐతే కొన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లైతే గుండెను పదిలంగా కాపాడుకోడుకోవచ్చు. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హడావుడిగా తినకుండా నిదానంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి.
 
వారంలో ఒక్కసారైనా చేపలు తినండి. చేపల్లో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. పొగాకు ఏవిధంగా వాడినా అది గుండెకు చేటని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. దాని వల్ల గుండెజబ్బులు తగ్గుతాయి. వీలైతే మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిది.
 
రాత్రి భోజనం మితంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. డైటింగ్ చేయకుండా, దానికి బదులుగా ఎక్కువసార్లు తక్కువ మోతాదుల్లో తినండి. మానసిక ఒత్తిడి తగ్గేందుకు జంతువులను పెంచుకోండి. వాటితో కాలం గడుపునప్పుడు మానసిక ఒత్తిడి తగ్గి గుండెపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచే ఆకుకూరలు, కూరగాయల వాడకూడదు. ఫ్రిజ్‌లో పెట్టిన వాటిల్లో 50 నుంచి 60 శాతం పోషకాలు నశించిపోతాయి. మీరు ఇష్టపడే ఆహారపదార్థాలను దేన్నీ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొంత సమయం తీసుకుంటూ అదేపనిగా తినకుండా అప్పుడప్పుడూ తినడం మంచిది.

 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు