గుండె ఆరోగ్యంగా వుండాలంటే.. బరువు తగ్గాల్సిందేనా..?

సోమవారం, 24 జూన్ 2019 (14:14 IST)
గుండె ఆరోగ్యంగా వుండాలంటే.. బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు. బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలని వారు చెబుతున్నారు.


గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కడం ద్వారా రక్తపోటు తగ్గుతుంది. అంతేగాకుండా అరగంట పాటు రోజూ నడవండి. ఇలా చేస్తే.. ఆరోగ్యానికే కాకుండా గుండెకు ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
ఇంకా డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోవాలి. ఉప్పు ఎంతమేరకు తగ్గిస్తే అంత మంచిది. రోజుకు ఒకటిన్నర స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్కహాల్, పొగతాగడాన్ని మానేయడం మంచిది. 
 
వీటితో పాటు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాయామం చేయడం మరిచిపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా బాదం పప్పుతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే..? ఇందులో విటమిన్ ఇ, కాపర్, మెగ్నీషియంలతో పాటు ఎక్కువ మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. బాదం గింజలలోని బయో యాక్టివ్ మాలిక్యూల్స్ గుండె సంబంధ వ్యాధులను నివారిస్తాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు