అరటి తోటలో పడగవిప్పి నీటికోసం ఎదురుచూస్తున్న ఓ తాచుపాము.. అటవీ శాఖాధికారి కంట పడింది. వెంటనే ఆ అధికారి దాన్ని తరిమికొట్టకుండా.. వెంటనే తనవద్ద ఉన్న బాటిల్‌లో నీటిని దానికి పట్టించారు. అంతేకాదు చిన్నపిల్లాడిని సాకినట్టు పాము పడగపై చేయివేసి నిమురుతూ బాటిల్‌ను దాని నోటివద్ద పెడితే అది గుటకలు వేస్తూ నీటిని తాగేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.