హైబీపీని నియంత్రించాలంటే.. పోషకాహారం తీసుకోవాల్సిందే

సోమవారం, 26 అక్టోబరు 2015 (17:02 IST)
హైబీపీని నియంత్రించాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైబీపీతో గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఇంకా హైబీపీని పట్టించుకోకపోతే కంటి చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. 
 
కాబట్టి హైబీపీని కంట్రోల్ చేయడంపై అధిక శ్రద్ధ తీసుకోవాలి. తీసుకునే ఆహారంలోనూ, వైద్యులను సంప్రదించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ప్రపంచంలో ముగ్గురిలో ఒకరు హైబీపీతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది. 20-30 సంవత్సరాలుండే వారిలో పది మందిలో ఒకరికి మాత్రమే హైబీపీ ఉన్నట్లు ఆ స్టడీ తేల్చింది. 
 
కానీ 50 ఏళ్లు దాటిన వారిలో పదిలో ఐదుగురికి హైబీపీ ఉన్నట్లు తెలిసింది. ఆఫ్రికా వంటి ఆదాయం తక్కువైన దేశాల్లో 40 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. అదే భారత్‌లో హైబీపీతో బాధపడే వారి సంఖ్య అత్యధికమని వరల్డ్ హెల్త్ ఆర్గనిజేషన్ తెలిపింది. ఇందుకు పొగతాగడం, పోషకాహార కొరత, మద్యపాన సేవనం, వ్యాయామం లేకపోవడం వంటివే హైబీపీకి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
అలాగే హైబీపీకి చెక్ పెట్టాలంటే ఈ ఆరు సూత్రాలు ఫాలో చేస్తే.. 
* ఆహారంలో ఉప్పు అధికంగా చేర్చుకోవద్దు 
* పోషకాహారంతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. 
* ఆరోగ్యం దెబ్బతినే విధంగా మద్యపాన సేవనం కూడదు. 
* కావాల్సినంత శరీరానికి శ్రమ అవసరం. ప్రతీరోజూ వ్యాయామం చేయాలి. 
* వయస్సు, ఎత్తుకు తగినట్ల శరీర బరువు కలిగివుండాలి. బరువు ఎక్కువైతే తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. 
* పొగాకు, సిగరెట్ తాగడాన్ని మానేయాలి.

వెబ్దునియా పై చదవండి