ఎయిడ్స్ లక్షణాలు- నివారణ చర్యలు

మంగళవారం, 29 నవంబరు 2022 (20:21 IST)
ప్రాణాంతక ఎయిడ్స్‌ను ఎలా గుర్తించవచ్చు.. అంటే.. గొంతునొప్పి ఎక్కువ రోజుల పాటు వుండటం. జ్వరం, దీర్ఘకాలిక విరేచనాలు, దగ్గు, చర్మవ్యాధులు వుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. శరీర బరువు బాగా తగ్గినా పరీక్షలు తప్పనిసరి. నెల రోజులకు మించిన జ్వరం వుంటే హెచ్ఐవీ పరీక్షలు తప్పక చేసుకోవాలి. 
 
ఎయిడ్స్‌ బారిన పడకుండా ఉండాలంటే.. వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. వివాహ జీవితంలో భాగస్వామితో మాత్రమే లైంగిక సంబంధం పరిమితం చేసుకోవాలి. కండోమ్స్ వాడాలి.
 
హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఉన్న వారి రక్తం ఇతరులకు ఎక్కించకూడదు. అలాగే తల్లి నుంచి బిడ్డకు, కలుషిత సిరంజీల వల్ల ఎయిడ్స్‌ వ్యాధి సంక్రమించే అవకాశం వుంది. కాబట్టి ఇతరుల బ్లేడును వాడటం కూడదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు