ముఖ్యంగా, రాష్ట్రంలోని సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్, జిల్లాల్లో ఇప్పటికే బంగారు గనులు వెలికితీత పనులు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి.
కాగా, బంగారు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే, మయూర్ భంజ్ జిల్లాలోని ఝూసిపూర్, సూర్యాగుడా రువంశి, ఇదెల్కుచా, మారెడిమి, సులేపట్, బడం పహాడ్‌లలో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అలాగే, దేవగఢ్ జిల్లాలోని అదసా, రాంపల్లి, కియోంజర్ జిల్లాలో గోపూర్, గజీపూర్, మంకాడ్ చువాన్, సులేకానా, దిమిరి ముండా, మల్కాన్ గిరి, సంబల్ పూర్ బౌద్ జిల్లాల్లో సైతం పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది.