మారుతున్న కాలంతో పాటు అనేక రకాల కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి ఐ ఫ్లూ వరకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వర్షాల కారణంగా, భారతదేశంలో అంటువ్యాధుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
గ్రీన్ టీ బ్యాగ్స్: మనం తరచుగా గ్రీన్ టీ తాగుతాం. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఐ ఫ్లూ నుంచి తేలికగా ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. ఈ టీ బ్యాగ్‌లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి, ఐ ఫ్లూ సోకిన కంటిపై ఉంచడం వల్ల త్వరలో మంచి ఫలితాలు వస్తాయి. వాపు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
ఇంకా వాపు సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే, పిల్లలకు ఈ రెమెడీని ఉపయోగించే ముందు అనేక జాగ్రత్తలు పాటించాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత కంటిలోకి పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.