వేడినీటికి అలవాటు పడిపోతే.. ఆరోగ్యంగా వుంటారట!

బుధవారం, 22 జనవరి 2020 (14:15 IST)
వేడినీటికి అలవాటు పడిపోతే.. ఆరోగ్యంగా వుంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ వాటర్ తాగేవారు ముందు ఆ నీటిని సేవించడం మానేస్తే.. అనారోగ్య సమస్యలు వుండవని సూచిస్తున్నారు. వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని, వేడినీటి సేవనం ద్వారా రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.
 
అలాగే శొంఠిపొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. ఫుల్‌గా తిన్నాక గ్లాసుడు వేడినీరు తీసుకుంటే అనారోగ్య సమస్యలు వుండవు. దాహం వేస్తే చల్లటి నీరు తాగడం కంటే వేడినీటిని తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి.
 
భోజనానికి అరగంట ముందు గ్లాసు వేడినీరు తాగితే శరీర బరువు తగ్గుతుంది. దీంతో ఊబకాయానికి చెక్‌ పెట్టవచ్చును. అలాగే చర్మానికి కూడా వేడినీరు ఎంతో మేలు చేస్తుంది. ఓ టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్‌ను లీటరు నీటిలో కలిపి.. ఆ నీటిని తాగడం ద్వారా చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు