ఆకలిలేమి, వేవిళ్లు, అజీర్తి వంటి రుగ్మతలను తొలగించుకునేందుకు అల్లం యాంటీ యాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లం కంటే శొంఠిలో ఎక్కు ఔషధ గుణాలున్నాయి. అల్లం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉదర పేగులో చేరే క్రిములను నశింపజేస్తుంది. లివర్‌ను శుభ్రపరుస్తుంది. ఆకలిలేమితో బాధపడేవారు.. అల్లం, కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారుచేసుకుని తీసుకోవడం మంచిది.
గొంతునొప్పికి అల్లం రసం మెరుగ్గా పనిచేస్తుంది. కానీ అల్లాన్ని మితంగా తీసుకోవాలి. ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు. అల్లం పచ్చడి గొంతు నొప్పి, ఛాతి నొప్పిని దూరం చేస్తుంది. అల్లం రసంలో బెల్లం కలుపుకుని తాగితే వాత సమస్యలు దూరమవుతాయి. అల్లం, పుదీనా పచ్చడిని తీసుకుంటే పిత్త, అజీర్తి దూరమవుతుంది. నోటి దుర్వాసన ఉండదు. చురుగ్గా ఉంటారు. కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.