ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నిమ్మరసం తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు. పొద్దున్నే ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపునికి తాగితే.. ఉదర సమస్యలు దూరమవుతాయి. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన ముందు రోజు తీసుకున్న మసాలాలు శుభ్రమవుతాయి. తద్వారా కడుపు ఉబ్బరం, అల్సర్లు దరిచేరవు. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్.. బరువు తగ్గాలనుకునే వారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. ఆకలి నియంత్రణకు ఇది దారితీస్తుంది.
చాలామంది ఉదయాన్నే ఒక హాట్ కప్ కాఫీ లేదా గరం గరం చాయ్‌తో మొదలుపెడతారు. కాఫీ, లేదా టీ తాగి నిద్ర మత్తును వదిలించుకుంటారు. వీటికంటే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచెం నిమ్మ రసం కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని టాక్సిక్లను నిర్మూలించే సాధనంగా పనిచేస్తుందన ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.