ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలం, చలికాలంలో ఆస్తమా బాధితులు పడే బాధలు అంతా ఇంతా కాదు. అలాంటివారు డైట్‌లో బెండకాయను చేర్చుకోవడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే ఆస్తమా వ్యాధిగ్రస్థులు భోజనంలో ఏదో ఒక రూపంలో రెగ్యులర్‌గా బెండను తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది.
అలాగే వేడికి గురైన శరీరాన్ని చల్లబరిచే గుణం బెండకు ఉంది. ఆధునిక జీవనశైలి తెస్తుస్న ముప్పులో మొదటిది అధిక బరువు సమస్య. కూర్చుని చేసే ఉద్యోగాలకుతోడు, మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తుండే వాళ్లను ఒబిసిటీ వేధిస్తోంది. దీనికి చక్కటి ఔషధం బెండ. అధిక బరువును తగ్గించడమే కాకుండా.. చెడు కొవ్వులను శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్త పడుతుంది.
ఇంకా చర్మ సౌందర్యంలోను బెండ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని యుక్తవయసులో ఉన్నట్లు చేస్తుంది. ఇంకా రోగనిరోధకశక్తిని పెంచి, కంటిచూపును మెరుగుపరిచి, ఎనీమియా, డయాబెటిస్‌ను ఆరోగ్య నిపుణులు అంటున్నారు.