ఆ సమయంలో మీ జీవితంలో ఎప్పుడూ చేయనంత మూర్ఖమైన పనులు చేస్తారు...

మంగళవారం, 8 జనవరి 2019 (12:29 IST)
కోపం అనేది ఒక స్థాయి అసంతృప్తి, మీలోనూ మీ చుట్టూ ఉన్న వారిలోనూ ఉంటుంది. మీ కోపానికి గురైన వ్యక్తి కంటే మీరే ఎక్కువ బాధపడుతారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ జీవితంలో ఎప్పుడూ చేయనంత మూర్ఖమైన పనులు చేస్తారు. ఆ విధంగా జీవించడం అంత తెలివైన పద్ధతేమీ కాదు. దేనిపట్లనైనా కోపం రావడమన్నది మనకుండే గాఢమైన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. 
 
మీ ఉద్దేశంలో మీది అత్యంత ఉత్తమమైన జీవన పద్ధతి. ఒక విధమైన ఆలోచనా విధానం నుండి, అనుభవం నుండి ఏర్పడే దృఢమైన గుర్తింపే దీనికి కారణం. ఎవరైనా ఈ పద్ధతికి భిన్నంగా ప్రవర్తిస్తే మీకు వాళ్లమీద కోపం వస్తుంది. ఏ విషయంలోనైనా మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ గుర్తింపులు బలపడితే, మీరు సృష్టి నుండి దాన్ని వేరుచేస్తున్నారన్నమాటే.
 
ఇష్టాయిష్టాలు ఎంత దృఢపడితే మీరు అన్నింటి నుండి విడిగా ఉన్నట్లు వ్యవహరించడం కూడా అంత దృఢపడుతుంది. దేన్నో, ఎవరినో మీలో భాగంగా మీరు స్వీకరించనందవలనే క్రోధం పొంగిపొరలుతుంది. ముక్తి అంటేనే అన్నింటితో చేరిపోవడం. వేరుచేయడం కాదు. అన్నింటినీ కలుపుకోవడంలోనే మీకు ముక్తి లభిస్తుంది. ఏ రోజున ప్రతి దాన్నీ, మొత్తం సృష్టిని మీలో కలుపుకుంటారో ఆ రోజూ మీరు విముక్తులవుతారు. వేరు చేయడం లేదా తిరస్కరించడం అంటే మీరు వలలో పడినట్లే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు