గోధుమ రవ్వతో చేసే ఉప్మాను వారానికి ఓసారైనా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రవ్వలో ప్రోటీన్లు అధికం. ఇందులో ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి అనిపించదు. దీంతో స్నాక్స్‌గా జంక్ ఫుడ్ తీసుకోవాలనే ఆలోచన రాదు. అందుకే సాయంత్రం పూట స్నాక్స్‌గా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గోధుమ రవ్వలోని ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం శరీరంలోని నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. అలాగే గుండె సమస్యలను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.