సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది తీవ్రమైన ఆస్తమా లక్షణాలను నియంత్రిస్తుంది. విటమిన్ డి రోగనిరోధక శక్తిని చురుగ్గా చేయడానికి సహకరిస్తుంది. విటమిన్ డి లో విటమిన్ డి1, డి2, డి3 డి7 ఇలా చాలా రకాలున్నాయి. కానీ వాటిల్లో విటమిన్ డి2 (ఎర్గో క్యాల్సిఫెరాల్), విటమిన్ డి3 (కోలీ క్యాల్సిఫెరాల్) చాలా ముఖ్యమైనవి.
ఆస్తమా లక్షణాలతో నిరంతరం బాధపడేవారికి ఓ మంచి శుభవార్త. ఆస్తమా రోగులకు సూర్యరశ్మి చక్కగా తోడ్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా ఆస్తమా రోగుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, విటమిన్ డి లోపం కూడా ఉంటుందని, అలాంటి వారు తగినంత సూర్యరశ్మిని పొందడం వలన వారిలో రోగనిరోధక శక్తిని బలాన్ని పెంచుకోవచ్చును.
ముఖం, చేతులు, భుజాలు, సాధ్యమైనంత వరకు శరీర భాగాలు లేత ఎండ కాంతికి ఎక్స్‌పోజ్ అయ్యేలా సూర్యోదయ వేళల్లో ఆరుబయట నడవడం మంచి మార్గం. దీనితో పాటు డాక్టర్లు అనేక రకాల విటమిన్ డి మాత్రలను ఉపయోగించాల్సిన మోతాదులను సూచిస్తుంటారు. ఒకవేళ మాత్రలు సరిపడక స్వాభావిక రూపంలోనే విటమిన్-డి ని పొందాలని అనుకుంటే తీసుకోవాల్సిన ఆహారాం, చేపల కాలేయాల్లో లభ్యమయ్యే నూనెల్లో విటమిన్ డి దొరుకుతుంది.
విటమిన్-డి మాత్రలు వాడటం, కాడ్‌లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల రోజుకు 125 మైక్రో గ్రాముల మోతాదు దాటి ఒక్కోసారి విపరీతంగా దాహం, కంట్లో కురుపులు, చర్మంపై దురదలు రావడం వంటిని జరుగుతాయి. దాంతోపాటు వాంతులు, నీళ్లవిరేచనాలు వంటివి కూడా కనిపించవచ్చు. ఒక్కోసారి రక్తనాళాల్లోని, మూత్రపిండాలలో క్యాల్షియమ్ పెచ్చులు రావచ్చును.
రక్తనాళాలతో పాటు కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మూత్రపిండాల్లో, కడుపులో క్యాల్షియమ్ మోతాదులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎండలో తిరగడం లేదా స్వాభావికమైన ఆహారం ద్వారా కాకుండా ఇతరత్రా రూపాల్లో విటమిన్-డి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కేవలం నిపుణుల సూచనల మేరకే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.