స్త్రీలు స్లిమ్‌గా వుండాలని కోరుకోవడంలో తప్పులేదు. అలానే మగవారు కూడా. కాని ముఖ్యంగా మహిళలు మాత్రం స్లిమ్‌గా ఉండడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వారు వాడని మందుండదు. దాదాపు ఎక్కువమంది మహిళలు ఆహారాన్ని తీసుకోవడం మానేస్తుంటారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదంటున్నారు వైద్యులు. స్లిమ్‌గా వుండడానికి మోదుగపూలును వాడితే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
మోదుగ పువ్వులు, గింజలు రెండింటినీ కలిపి ఎండబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. ప్రతిరోజు పావు చెంచా పొడిని చిక్కటి టీలాగా కాచుకుని తాగుతే ఎన్నో లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా స్త్రీలు స్లిమ్‌గా, కాంతివంతంగా వుంటారంటున్నారు.
మోదుగ చెట్లు మనకు సహజంగా రోడ్లపక్కన దర్శనమిస్తుంటాయి. ఇవి ఎక్కడైనా పెరుగుతాయి. వీటి గింజలను మోదుగ మాడలు అని అంటారు. మోదుగ గింజలు, మోదుగ పూలు ఈ రెండింటికీ చర్మాన్ని కాంతివంతంగా చేసి, చర్మ రోగాల్ని పోగొట్టే గుణం మాత్రమే కాకుండా, స్థూలకాయాన్ని తగ్గించే శక్తికూడావుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. దీనిని వాడితే మూలవ్యాధులు(పైల్స్), సుఖవ్యాధులు, రక్తదోషాల్నికూడా నివారిస్తుందంటున్నారు వైద్యులు.