శరీరానికి బలాన్నిచ్చే విటమిన్ బి సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తింటే.. ఎక్కువగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు.. బియ్యంలో ఉండే 12 రకాల బి విటమిన్స్ 80 శాతానికి పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి.
ఉదాహరణకు మన ఇంట్లో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల వారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. అలానే 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు.. ఇక వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. అందుకు ముఖ్యకారణం తెల్లటి బియ్యం తినడం అని ఇటీవలే ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. బియ్యం పై పొరలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. అయితే ఈ తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా లేదు.
శరీరానికి ఎక్కువ సమయం వరకు.. అధిక శక్తిని సమకూర్చలేదు. తిన్న 3, 4 గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం వంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్లను తినాలనిపించే విధంగా చప్పదనముంటుంది.