నీటిని ఇలానే తాగాలి.. కూర్చుని గుటక గుటకగా...? (Video)

గురువారం, 27 ఆగస్టు 2020 (19:06 IST)
నీటిని తాగేందుకు కూడా కొన్ని పద్ధతులు వున్నాయని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. కూర్చుని గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి. అలాగే చల్లని నీటిని సేవించడం కూడదు. గోరువెచ్చని నీటిని ప్రతిరోజూ సేవించడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వర్షాకాలంలో, శీతాకాలంలో గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. 
 
స్నానం చేసిన తర్వాత నీటిని తాగకూడదు. స్నానం చేసిన వెంటనే నీళ్ళు తాగినట్లైతే చర్మవ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి. మనకు ఆహారం ఎంత ప్రధానమో, తినిన ఆహారము సక్రమంగా జీర్ణమవడం అంతే ప్రధానం. తీసుకున్న ఆహారం భోజనం జీర్ణం కాకపోతే.. అదే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన ఆహారం వల్ల శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణమవుతుంది. 
 
తొలుత గ్యాస్ ట్రబుల్ , గొంతులో మంట, గుండెలో మంట, ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి. అంతేగాకుండా... చివరగా క్యాన్సర్ కూడా సోకే ప్రమాదం వుంది. అందుకే నీటిని చప్పరిస్తూ తాగినట్లైతే.. ఇలాంటి రోగాల బారినపడరు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు