నోరూరించే మామిడిపండ్లు... కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లయితే....

బుధవారం, 15 మే 2019 (14:38 IST)
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్‌లో లభించే వివిధ రకాల మామిడి పండ్లు మనకు నోరూరించేలా చేస్తాయి. అయితే వీటిని పండించడానికి కొంతమంది కృత్రిమ పద్ధతులను అనుసరిస్తుంటారు. అందులో ప్రధానంగా కార్బైడ్ ఉపయోగిస్తుంటారు. 
 
ప్రస్తుతం అనేకమంది వ్యాపారులు కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పళ్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి పండ్లను మనం కొని తింటున్నాం. దీనితో పాటు ఆనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌ను మ‌నం సుల‌భంగానే గుర్తించ‌వ‌చ్చు. అది ఎలాగో మీరూ ఓ సారి చూడండి.
 
* కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లలో కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ఈ పండ్లు ముదురు ఎరుపు, పసుపు రంగులలో ఉంటాయి.
 
* కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లను నీటిలో వేసినట్లయితే పైకి తేలుతాయి. అదే సహజంగా పండించిన పండ్లయితే నీటిలో మునుగుతాయి.
 
* సహజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్తగా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమల దగ్గర మంచి వాసన వస్తుంది.
 
* కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్ల లోపల అక్కడక్కడా పచ్చిగానే ఉంటుంది. దీంతో పులుపుగా ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లయితే రసం ఎక్కువగా వస్తుంది. దానితో పాటు రుచి కూడా తియ్యగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు