గుజరాత్‌లో కీలక పరిణామం - సీఎం మినహా మంత్రులంతా రాజీనామా

ఠాగూర్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (09:11 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులంతా తమతమ పదవులకు రాజీనామా చేశారు. అదేసమయంలో కొత్త మంత్రివర్గాన్ని శుక్రవారం పునర్ వ్యవస్థీకరించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 
 
మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్తవారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు