వేసవికాలంలో శరీరానికి వేడిని తగ్గించాలంటే?

శుక్రవారం, 11 మే 2018 (15:11 IST)
వేసవిలో మీ శరీరం సూర్య కిరణాల తాకిడికి అలాగే స్పైసి ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫ్ఫిన్ ఇలాంటి వాటి వల్ల శరీరం వేడికి గురిఅవుతుంది. జబ్బులు, మందులు కూడా శరీరంలో వేడి పెరగటానికి కారణాలవుతాయి. వాటినుంచి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చుద్దాం.
 
మామూలు మానవ శరీర ఉష్ణోగ్రత 36.9.సి. అయితే వాతావరణ మార్పులను బట్టి కొంచెం అటూఇటూ అవ్వటం సాధారణమే. కానీ ఈ ఉష్ణోగ్రత కంటే ఏ మానవుని శరీరం హెచ్చుతగ్గులకు గురి అవటం ప్రమాదకరం. శరీరంలోని వేడిని పెంచే ఆహారపదార్థాలు ఆర్గాన్లను పాడు చేయటమే కాకుండా  శరీర దృఢత్వాన్ని కూడా నాశనం చేస్తాయి.
 
శరీరంలోని వేడికి గల కారణాలు
1. బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం.
2. జబ్బులు, జ్వరం రావటం లేదా ఇంఫెక్షన్స్.
3. థైరాయిడ్ సమస్య వలన శరీరంలోని వేడి పెరిగుతుంది. 
4. అధికంగా వ్యాయామం చేయటం. 
5. అనారోగ్యాలు కండరాల వైకల్యాలు వేడికి కారణం.
6. మందులు, న్యూరో సంబంధిత వ్యాధులు కూడా శరీర వేడికి కారణమవుతాయి.
7. సోరియాసిస్, సెలొరోసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఎక్జెమా ఇలాంటి జబ్బులు అధిక వేడిని పెంచి చెమట పట్టేలా చేస్తాయి.
 
శరీరంలోని వేడిని ఎలా తొలగించుకోవాలి
1. వేడి ప్రాంతాలకు, స్పైసీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
2. కొవ్వు పదార్ధాలను దూరంగా ఉండాలి.
3. సోడియం తక్కువగా కలిగిన పదార్ధాలను తింటే మంచిది.
4. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె లను వాడండి.
6. వేరుశనగ నూనె మానేయ్యాలి.
5. రోజూ ఆహారంలో నట్స్ ఉపయోగించకుండా వారానికి 2-3 సార్లు మాత్రమే వాడాలి.
6. దాదాపు శాఖాహార భోజనాన్నే వాడాలి. మాంసాన్ని తక్కువగా తీసుకుంటే మంచిది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు