అతిలోక సుందరి శ్రీదేవికి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ పరిశ్రమ ఏదైనా అసాధారణ గుర్తింపు వుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిగా వీరాభిమానులున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ నాయికగా బోనీకపూర్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిలయ్యారు.
పెళ్లికి తర్వాత సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసిన శ్రీదేవి ''ఇంగ్లిష్ వింగ్లిష్'' చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించారు. చివరిగా 2017లో ''మామ్'' చిత్రంలో నటించారు. శ్రీదేవి దుబాయ్‌లో బాత్ టబ్‌లో మునిగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.
తాను దుబాయిలోని హోటల్ సిబ్బంది నుంచి, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నుంచి, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మీడియాలో వచ్చిన దానికి భిన్నంగా ఉందని సునీల్ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
అంతేగాకుండా సునీల్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం బెంచ్ కొట్టివేసింది. శ్రీదేవి పేరిట ఉన్న బీమా పాలసీలు దుబాయ్‌లో మరణిస్తే చెల్లింపులు జరుపుతాయని పిటిషనర్ కోర్టుకు నివేదించారు.
ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ.240 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు తెలిపారు. అంతేగాకుండా 5.7 అడుగులు ఉండే వ్యక్తి కేవలం 5.1 అడుగుల బాత్‌టబ్‌లో మునిగి ఊపిరాడక చనిపోతారని అడిగారు. అనుమానస్పద పరిస్థితుల్లోనే శ్రీదేవి మరణించారని వికాస్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.