ఇంతవరకు బాగానే ఉన్నా.. యోగావల్ల శరీర అవయవాలకు, ముఖ్యంగా చేతులకు ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. యోగా చేస్తున్న 10 మందిలో ఒకరికన్నా ఎక్కువ మందికి ‘మస్క్యులోస్కెలెటల్’ పెయిన్స్ అంటే కండస్థ ఎముకలకు సంబంధించిన నొప్పులు వస్తాయని వెల్లడైంది.
యోగా వల్ల భుజాలు, మోచేతులు, ముంచేతులకు నొప్పులు వస్తాయని, కొన్ని సార్లు కాళ్లకు కూడా నొప్పులు వస్తాయని ఈ పరిశోధన చెపుతోంది. ఇతర క్రీడల వల్ల శరీరానికి ఎలా గాయాలయ్యే అవకాశం ఉందో, యోగా వల్ల కండరాలకు గాయాలయ్యే అవకాశం ఉందట. యోగా వల్ల తాము ఇంతకుముందు అంచనా వేసిన ముప్పు కంటే ఇప్పుడు ముప్పు పదింతలు ఎక్కువని స్పష్టమైందని ఆయన వెల్లడించారు.