నేటి తరుణంలో ఎక్కడ చూసినా ఈ స్మార్ట్‌ఫోన్సే కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ అవసరమైన విషయాలను వెంటనే తీరుస్తాయి. ఎప్పుడూ అలానే ఉంటాయని చెప్పలేం కదా. స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే కంటి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు సైంటిస్టులు. ఈ ఫోన్స్ పెద్దవారి కంటే పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.
కంప్యూటర్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర గాడ్జెట్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు పిల్లలు. ఇది వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా వీడియో గేమ్స్ ఆడే పిల్లలకు దృష్టి లోపం, ఇతర వ్యాధి రుగ్మతలు, ఒబిసిటీ కాకుండా, చివరకు క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. ఈ విషయం మీద బ్రిటన్‌లోని క్యాన్సర్ పరిశోధనలో సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు.
మామూలు పిల్లలతో పోల్చుకుంటే రోజంతా వీడియో గేమ్స్ ఆడే చిన్నారులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఈ పరిశోధనలో సుమారు 2వేల మంది పిల్లలపై అధ్యయనం చేశారు. అంతేకాదు.. ఫోన్స్ కాకుండా టీవీలలో చూపించే జంక్‌ఫుడ్స్‌పై వచ్చే యాడ్స్ కూడా వీరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.