మారిపోతున్నారు.. మాంసం వద్దు ... ఫ్రూట్సే ముద్దట

మంగళవారం, 15 జనవరి 2019 (17:22 IST)
ఆధునిక జీవనశైలికి అలవాటుపడిన చాలా మంది త్వరగా అనారోగ్యంపాలవుతున్నారు. ఫలితంగా వారు త్వరగానే తమ జీవితాన్ని కోల్పోతున్నారు. ముఖ్యంగా, వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్నారు. దీంతో అనేక మంది తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకుంటున్నారు. 
 
ముక్కలేనిదే ముద్ద దిగని వాళ్లెందరో రూటు మార్చేస్తున్నారు. చికెన్, మటన్‌లను పక్కన పెట్టేసి పండ్లు, ఆకు కూరలను ఎక్కువగా తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇలా మారిపోతున్నవారి శాతం ఏకంగా 63 శాతంగా ఉండటం గమనార్హం. ఇటీవల ఐప్సోస్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 
 
గత యేడాది ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం విడుదల చేశారు. ఒకప్పుడు తందూరీ చికెన్లు, మటన్ బిర్యానీలు తెగ లాగించేసేవాళ్లు కూడా వాటిని వదిలేశారట. 63 శాతం మంది శాఖాహారమే మేలని నిర్ణయించుకున్నారని సర్వే తెలిపింది. అలాగే 57 శాతం మంది ఆర్గానిక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారని వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు