ఐర్లాండ్ ఉద్యోగం వద్దు.. స్వగ్రామ సర్పంచ్ కుర్చీనే ముద్దు

మంగళవారం, 15 జనవరి 2019 (15:46 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువతి విదేశీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడింది. ఇందుకోస ఐర్లాండ్‌ దేశంలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ మహిళ పేరు సుశ్మితా నాయుడు. ఈమె తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. 
 
నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లికి చెందిన ఈమె.. ఐర్లాండ్‌లోని డబ్లిన్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ పూర్తిచేసి అక్కడే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సర్వీసెస్‌లో టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. యేడాదిగా ఉద్యోగం చేస్తున్న సుస్మిత, పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. 
 
ఎడపల్లి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. సుస్మిత 1994 సెప్టెంబర్ 12న జన్మించారు. బోధన్‌లోని ఇందూర్ మోడల్‌స్కూల్‌లో ఎస్సెస్సీ, విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హైదరాబాద్ అరోరా డిగ్రీ కాలేజీలో బీబీఏ అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు. అక్కడే విద్యను పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు