అనీమియాకు చెక్ పెట్టాలా? ఐతే అల్పాహారం మానొద్దు..

శుక్రవారం, 24 మార్చి 2017 (09:40 IST)
రక్త హీనతతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. రక్తహీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. చేపలు, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, తాజాకూరగాయలు తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు ఒకసారి నీళ్లు తాగుతుండాలి. 
 
నిద్ర లేవగానే పరగడుపున మూడు గ్లాసుల మంచినీటిని సేవించాలి. ఆ నీరు శరీరంలోని పేరుకపోయిన వ్యర్థానంత టాక్సిన్ల ద్వారా బయటకు పంపుతుంది. ఇంకా రక్తహీనత కలిగిన వారు బరువును అదుపులో ఉంచుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.
 
అలాగే రక్తహీనతను దూరం చేసుకోవాలంటే.. భోజనానికి ముందు స్నాక్స్ తీసుకోకపోవడం మంచిది. డైట్‌లో పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారం మానేయకుండా తప్పక తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తీసుకోవడం మానేస్తే అనీమియా తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి