ఫ్రిజ్‌ వాటర్ తాగుతున్నారా.. జాగ్రత్త..?

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (10:18 IST)
చాలామంది వేసవి వేడి కారణంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ వేడి నుండి ఉపశమనం పొందాలని ఫ్రిజ్‌లో గడ్డకట్టడానికి సిద్ధంగా ఉన్న నీళ్లు తాగడానికే ఇష్టపడుతుంటారు. అందుకని అదేపనిగా ఫ్రిజ్‌లోని నీరు తాగడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చల్లని నీరు తాగడం వలన కలిగే ఏర్పడే సమస్యలు ఓసారి తెలుసుకుందాం..
 
చల్లని నీరు తాగితే అవి జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుంది. దాంతో డీహైడ్రేషన్‌కు లోనవుతాం. అంతేకాదు, రక్తనాళాలు కూడా కుంచించుకుపోతాయి. చల్లని నీరు శరీర అంతర్గత ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. దాంతో ఆ ఉష్ణోగ్రతను సమం చేయడానికి అవసరమైన శక్తిని, ఆహారం జీర్ణం చేసుకునే పోషకాల నుండి గ్రహించకుండా, అప్పటికే నిల్వవున్న శక్తి నుండి శరీరం ఖర్చు చేస్తుంది. 
 
ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత చల్లని నీరు తాగితే శరీరంలో ఎక్కువగా శ్లేష్మం తయారవుతుంది. దాని ఫలితంగా శరీర రోగనిరోధకశక్తి తగ్గి తేలికగా జలుబు, దగ్గు బారిన పడుతాం. అలానే భోజనం తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే చల్లని నీరు తాగితే ఆహారంలోని కొవ్వులు గడ్డకట్టిపోతాయి. దాంతో జీర్ణాశయం అవసరానికి మించి శ్రమించవలసి వస్తుంది. 
 
కనుక వీలైనంత వరకు వేసవిలో చల్లని నీరు తాగడం కాస్త తగ్గిస్తే సరిపోతుంది. అలానే గోరువెచ్చని నీరు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. క్యాలరీలు ఖర్చు కావాలంటే చల్లని నీరు తాగాలని కొందరు నమ్ముతారు. కానీ జీర్ణశక్తిని కుంటుపరచి, జీర్ణవ్యవస్థను ఒత్తిడికి లోనుచేసి క్యాలరీలను ఖర్చుచేసే పద్ధతి ఆరోగ్యకరం కాదు. అధిక బరువు తగ్గడానికి ఇంతకుమించిన ఆరోగ్యకరమైన మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిని అనుసరించాలి. చల్లని నీరు తాగడం మాని గోరువెచ్చని నీరు తాగాలి.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు