జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. తుమ్ములు, దగ్గు మనల్ని బాధిస్తాయి. అలాగే తల, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. పారాసిటమల్ బిళ్ల వేసుకున్నా, ఇన్‌హేలర్స్ పీల్చినా ఉపయోగం ఉండదు. దీని నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది అల్లం, తేనె కలిపిన టీని సిఫార్సు చేస్తారు. మరికొందరు నిమ్మకాయ తినమంటారు. చికెన్ సూప్ తాగినా కూడా జలుబు తగ్గుతుందని కొందరు నమ్ముతారు.
ఏది ఏమైనా మనం జలుబు వస్తే జాగ్రత్త పడాలి. జలుబును అశ్రద్ధ చేస్తే అది ఆస్తమా, అలర్జీలుగా మారే అవకాశం ఉంది. జలుబు ఒక అంటువ్యాధి, అది తుమ్ములు, దగ్గు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జలుబు సాధారణంగా 7 నుండి 12 రోజుల లోపు తగ్గుతుంది.