చలికాలంలో బెల్లం తింటే మంచిదా.. కాదా?

గురువారం, 6 జనవరి 2022 (16:35 IST)
సాధారణంగా ఏ కాలంలో అయినా బెల్లం తినొచ్చు అంటుంటారు పెద్దలు. రోజూ కొంత బెల్లం తింటే ఎంతోమంచిదని కూడా చెబుతుంటారు. ఎందుకంటే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయట. మన తాతముత్తాతలు బెల్లంను ఎక్కువగా తినడం వల్లనే ఎక్కువకాలం బతికారని కూడా వైద్యులు చెబుతుంటారు. 

 
అయితే అలాంటి బెల్లంను ప్రస్తుత చలికాలంలో తింటే మంచిదా..కాదా అన్న అనుమానం చాలామందిలో ఉంటుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సీజన్లో రోజూ కొంత బెల్లంను తింటే ఎంతోమంచిదంటున్నారు వైద్య నిపుణులు.

 
బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుందట. చలికాలంలో ఊపిరితిత్తులు ముడుచుకుని గాలి పీల్చడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బెల్లంను తింటే ఫ్రీగా మారి ఇబ్బందులు అధిగమిస్తారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

 
అయితే పంచదారకు బదులు బెల్లంను ఎక్కువగా వాడాలని కూడా చెబుతున్నారు. దీన్ని ఎక్కువగా వాడితే అధిక బరువు పెరిగే అవకాశం ఉందట. 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర ఉంటుందట. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే బెల్లంను తినాలని సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు