శీతాకాలంలో చుండ్రు సమస్య మరింత వేధిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. చుండ్రు సమస్య నివారణకు రోజు మార్చి రోజు తల స్నానం చేయాలి. షాంపూ వాడకం తగ్గించి, శీకాయపొడి, కుంకుడుకాయలను వాడాలి. ఇతరుల దువ్వెనలు, టవల్స్‌ని తలకు వాడకూడదు. వేప ఆకులు, మెంతి, పెసర పొడులు మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది.