వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఒకటి రెండు చుక్కల నూనె చెవినొప్పినీ ఇన్ఫెక్షన్లనీ కూడా తగ్గిస్తుంది. వాము తినడం వల్ల ఆల్కహాల్ తాగాలనే కోరిక కూడా తగ్గుతుందట. జలుబుతో ముక్కు బాగా బిగిసిపోయి వుంటే వామును నూరి పలుచని బట్టలో కట్టి వాసన చూపిస్తే అది తగ్గుతుందట.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.