లెమన్ గ్రాస్ టీ అసమాన్యమైన ప్రయోజనాలు, ఏంటవి?

బుధవారం, 11 అక్టోబరు 2023 (18:34 IST)
లెమన్ గ్రాస్ టీ. లెమన్ గ్రాస్ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది.
 
ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది కనుక రక్తహీనత సమస్య వున్నవారు తీసుకుంటారు. మలబద్ధకం, అజీర్ణం, అపానవాయువు ఉదర సమస్యలను అడ్డుకోవడంలో మేలు చేస్తుంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
శరీర నొప్పులను వదిలించుకోవడానికి దీనిని తరచుగా తీసుకుంటారు. యాంటీ ఆక్సిడెంట్లున్న ఈ టీ వినియోగం మెదడుకి కూడా పదును పెడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు