లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

సిహెచ్

గురువారం, 12 డిశెంబరు 2024 (19:02 IST)
నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది, అయితే ఇది కొంతమందికి హానికరం. ఎలాంటివారు నిమ్మకాయ నీటిని తాగకూడదో తెలుసుకుందాము.
 
నిమ్మరసం ఆమ్లత్వం కలిగి ఉంటుంది, ఇది ఎసిడిటీని పెంచుతుంది.
అసిడిటీ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగకుండా ఉండాలి.
నిమ్మ ఆమ్లం పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.
దంతాలు సున్నితంగా లేదా నొప్పిగా ఉంటే, నిమ్మకాయ నీటికి దూరంగా ఉండండి.
కొంతమందికి నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ మైగ్రేన్‌లను ప్రేరేపిస్తుంది.
మైగ్రేన్‌ రోగులు నిమ్మరసం తాగడం మానుకోవాలి.
నిమ్మకాయలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలను కలిగిస్తుంది.
స్కిన్ అలెర్జీ ఉన్నవారు లెమన్ వాటర్ తాగితే ఇది చర్మంపై దద్దుర్లు లేదా చికాకు కలిగించవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు