అసలు మామిడిని ఎందుకు తినాలి. కప్పు నిండా మామిడి ముక్కల్ని తింటే ప్రయోజనం ఏమిటి అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి. ఒక కప్పు మామిడిలో 76 శాతం విటమిన్ సి వుంటుంది. దీని ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇక 25 శాతం విటమిన్ ఎ వుంది. విటమిన్ ఎ ద్వారా కంటికి మేలు చేసినట్లవుతుంది. 11 శాతం విటమిన్ బీ2- మెదడులో ఉత్పత్తి అయ్యే హార్మోన్ శాతాన్ని నియంత్రిస్తుంది. ఇంకా హృద్రోగ వ్యాధులను నివారిస్తుంది.
ఇంకా 9 శాతం పీచు ఉంచుతుంది. ఇవి శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఒక కప్పు మామిడిలో 6 శాతం కాపర్, 7 శాతం పొటాషియం, 4 శాతం మెగ్నీషియం ఉంటుంది. అందుచేత విరివిగా వేసవిలో లభించే మామిడిని రోజూ ఓ కప్పు తీసుకోవడం ద్వారా పైన చెప్పిన పోషకాలన్నీ శరీరానికి లభించినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.