మామిడి నరాలకు మేలు చేస్తుందట.. కొలెస్ట్రాల్ కూడా పరార్

బుధవారం, 3 జూన్ 2020 (12:22 IST)
మామిడి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో లభించే ఈ సీజన్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మామిడిలో విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు కాపాడుతాయి. ఇందులో బిటా కెరోటిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. 
 
మామిడిలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి, ఫైబర్ శరీరంలోని హాని చేసే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మామిడి పండు అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. పొట్టను శుభ్రం చేసే ధాతువులు మామిడిలో వున్నాయి. శరీరంలోని భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే పనుల్లో నరాలు చేస్తున్నాయి. మామిడిని ఆహారంలో తీసుకుంటే నరాలకు మేలు చేస్తుంది. తద్వారా నరాల బలహీనతను దూరం చేసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు