లాక్ డౌన్‌తో ఉద్యోగం పోయింది: గర్భవతి అయిన భార్యను పోషించలేక యువకుడు ఆత్మహత్య

బుధవారం, 3 జూన్ 2020 (11:34 IST)
గర్భవతి అయిన భార్యను పోషించలేక యువకుడు ఆత్మహత్య గురుగ్రాంలో చోటుచేసుకుంది. 34 ఏళ్ల యువకుడు గర్భం దాల్చిన తన భార్యకు వైద్య పరీక్ష కోసం ప్రతిరోజు తీసుకెళ్లాల్సి వుంది. ఐతే లాక్ డౌన్ కారణంగా నిరుద్యోగిగా మారిన అతడు ఆర్థిక పరమైన సమస్యలతో మానసికంగా కుంగిపోయాడు.
 
తన భార్యను వైద్య పరీక్ష చేయిస్తానంటూ ఆమెను తమ అత్తగారింటికి పంపి సుమారు రాత్రి 10 గంటల సమయంలో తన వద్ద వున్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఫరీదాబాద్ నుండి జీవనోపాధి కోసం గురుగ్రాం వచ్చాననీ, తన నిరుద్యోగ సమస్య తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లేఖలో అతడు పేర్కొన్నాడు.
 
ఈ సంఘటనపై స్థానికంగా వున్నవారు స్పందిస్తూ గత కొన్నిరోజులుగా భార్యాభర్తల మధ్య కీచులాటలు జరుగుతున్నాయనీ, ఈ విరక్తి ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు కలిసి అతడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై వుంటుందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు