ఎక్కువ గంటలు సైకిల్ తొక్కడం, గుర్రపు స్వారీ చేయడం, అధిక ఉష్టోగ్రతలో పనిచేయడం, ఎక్కువ గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. వృషణాల్లోంచి పురుషాంగంలోకి వచ్చే మార్గంలో ఏర్పడే అడ్డంకుల వల్ల అంటే వ్యాన్ డిఫరెన్స్ ఆబ్‌స్ట్రక్షన్, ల్యాక్ ఆఫ్ వ్యాస్ ఢిఫరెన్స్ వంటి సమస్యలు కూడా సంతానలేమికి కారణమవుతాయి. శీఘ్రస్థలన సమస్యకూడా ఇందుకు కారణమే.
పైన తెలిపిన కారణాలే కాకుండా వీర్యకణాల సామర్థ్యాల మీద సంతానం విషయం ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా అసలే వీర్యకణాలు లేకపోవడం, వీర్యకణాల సంఖ్య అవసరమైనంత లేకపోవడం, వీర్యకణాల్లో స్త్రీ అండాశయంలోకి దూసుకువెళ్లే చలన శక్తి లేకపోవడం ఇవన్నీ కారణాలే.